లోకేష్ పాదయాత్రలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ హల్‌చల్

కర్నూలులో లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్. లోకేష్ పాదయాత్రలో భాగంగా పాతబస్తీకి చేరుకున్న సమయంలో హఫీజ్‌ఖాన్ ఆయన వర్గీయులు ఓవరాక్షన్ చేశారు. కవ్వింపు చర్యలకు దిగుతూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
హఫీజ్‌ఖాన్, ఆయన అనుచరులు అంతటితో ఆగకుండా లోకేష్ పాదయాత్రకు ఎదురెళ్లి అడ్డుకోబోయారు. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా హఫీజ్‌ఖాన్, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయిదాటుతుండటంతో.. ఎమ్మెల్యేను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హఫీజ్‌ఖాన్‌ను పోలీసులు కారులో ఎక్కిస్తుండగా మీసం మెలేశారు. లోకేష్ తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. పాదయాత్రలో ఎక్కడ కలవాలో చెప్పి లోకేష్ మర్యాద కాపాడుకోవాలన్నారు హఫీజ్‌ఖాన్. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేసిన తర్వాత లోకేష్ కర్నూలు దాటి వెళ్లాలని డిమాండ్ చేశారు.
అంతకు ముందు.. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు అనేక సార్లు కవ్వింపు చర్యలకు దిగారు హఫీజ్‌ఖాన్. స్థానిక లతీఫ్ లావుబలి దర్గా దగ్గర ఖురాన్ పట్టుకొని హల్‌చల్ చేశారు. లోకేష్ ఖురాన్ పై ప్రమాణం చేసి తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని హడావుడి చేశారు.
ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. లోకేష్ ఆరోపణలు చేస్తే.. దీనిపై చర్చకు రావాలి కానీ.. ఇలా ఖురాన్ పట్టుకుని ఓవరాక్షన్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారు. అవినీతి ఆరోపణలు బయటికి రావడం వల్లే అసహనంతో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఇలా వ్యవహరిస్తున్నారంటూ కర్నూలు ప్రజలు చర్చించుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com