సీఎం జగన్‌కు స్టిక్కర్లపై ఉన్న శ్రద్ధ నీళ్లివ్వడంపై లేదు: లోకేష్‌

సీఎం జగన్‌కు స్టిక్కర్లపై ఉన్న శ్రద్ధ నీళ్లివ్వడంపై లేదు: లోకేష్‌
X
స్టిక్కర్లపై ఉన్న శ్రద్ధ నీళ్లివ్వడంపై లేదెందుకు జగన్? అంటూ ప్రశ్నించారు నారా లోకేష్

స్టిక్కర్లపై ఉన్న శ్రద్ధ నీళ్లివ్వడంపై లేదెందుకు జగన్? అంటూ ప్రశ్నించారు నారా లోకేష్. గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలను కొనసాగించడం చేతగాని జగన్ స్టిక్కర్లు వేసుకోవడానికి ఏమాత్రం వెనకాడటం లేదన్నారు. పేదల దాహార్తి తీర్చేందుకు నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణకొట్కూరులో తమ ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. ఈ పథకానికి నీళ్లివ్వకుండా పాడుబెట్టిన వైసిపి సర్కారు... తమ పార్టీ స్టిక్కర్లు మాత్రం వేసుకుందని మండిపడ్డారు. స్టిక్కర్లపై ఉన్న శ్రద్ధ సీమ ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వడంపై లేదేమీ జగన్మోహన్ రెడ్డీ? అంటూ లోకేష్‌ ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ సుజల ప్లాంట్‌ ముందు సెల్ఫీ దిగారు.

Tags

Next Story