Yuvagalam : వాల్మీకుల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉంది : లోకేష్

Yuvagalam : వాల్మీకుల అభివృద్ధికి టీడీపీ  కట్టుబడి ఉంది : లోకేష్

ఏపీలో వాల్మీకుల అభివృద్ధికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని నారా లోకేష్‌ భరోసా ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గం వడ్డెమాను గ్రామంలో వాల్మీకి సామాజిక వర్గీయులు లోకేష్‌ను కలిశారు. తమ సమస్యలను విన్నవించారు. టీడీపీ హయాంలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని.. ఆ బిల్లు ఇప్పటికీ ఆమోదం పొందలేదన్నారు. వాల్మీకులకు కులవృత్తి లేదని.. తమను ఎస్టీల్లో చేర్చి న్యాయం చేయాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాల్మీకి కార్పొరేషన్‌ కు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

వాల్మీకుల సమస్యల్ని నారా లోకేష్‌ సావధానంగా విన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సత్యపాల్‌ కమిటీ నివేదిక ఆధారంగా వాల్మీకులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వాల్మీకి కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీలో కేవలం 4 జిల్లాలకు చెందిన వాల్మీకులనే ఎస్టీ జాబితాలో చేర్చాలని వైసీపీ ప్రభుత్వం తప్పుడు తీర్మానాన్ని ఆమోదించిందని లోకేష్‌ ఫైరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story