ప్రతి గింజ కొనే వరకు పోరాటం చేస్తా: పవన్‌ కళ్యాణ్‌

ప్రతి గింజ కొనే వరకు పోరాటం చేస్తా: పవన్‌ కళ్యాణ్‌
X
ఇవాళ రెండోరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు

ఇవాళ రెండోరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అంతకుముందు.. రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న తొలిరోజు.. కడియంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించారు. దెబ్బ తిన్న పంటలను పరిశీలించారు. రైతులతో జరిగిన ముఖాముఖీ కార్యక్రమంలో జగన్ సర్కారుపై పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి గింజా కొనే వరకు రైతుల తరపున పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. అన్నదాతలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలుపరామర్శించిన పాపాన పోలేదని ఫైరయ్యారు. జనసేన అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

Tags

Next Story