ఉమ్మడి కర్నూలులో యువగళం జోరు

ఉమ్మడి కర్నూలులో యువగళం జోరు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది

ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. 96వ రోజు ఉదయం 7 గంటలకు నందికొట్కూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఎనిమిదిన్నర గంటలకు తార్టూరు క్రాస్ వద్ద గ్రామస్తులతో సమావేశం కానున్నారు లోకేష్. 8 గంటల 50 నిమిషాలకు మండ్లెం గ్రామంలో, పది గంటల 15 నిమిషాలకు తంగడంచ గ్రామంలో స్ధానికులతో సమావేశం నిర్వహించనున్నారు. పది గంటల 55 నిమిషాలకు తంగడంచలో బీసీ సామాజిక వర్గీయులతో నారా లోకేష్ ముఖాముఖీ నిర్వహించనున్నారు. 11 గంటల 55 నిమిషాలకు తంగడంచలో భోజనం విరామం తీసుకుంటారు.

భోజన విరామం తర్వాత సాయంత్రం 4 గంటలకు తంగడంచ నుంచి పాదయాత్ర కొనసాగుతోంది. 4 గంటల 20 నిమిషాలకు జూపాడుబంగ్లాలో తాండవ సామాజిక వర్గీయులతో, ఆ తర్వాత క్రిస్టియన్లతో సమావేశం అవుతారు నారా లోకేష్. 5 గంటల 10 నిమిషాలకు తాడిపాడు క్రాస్ వద్ద రైతులతోను, అనంతరం బీసీలతో సమావేశం కానున్నారు. సాయంత్ర 6 గంటల 40 నిమిషాలకు బన్నూరు శివారు విడిది కేంద్రంలో బస చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story