కావలి వైసీపీలో చెలరేగిన ఫ్లెక్సీల చిచ్చు

కావలి వైసీపీలో చెలరేగిన ఫ్లెక్సీల చిచ్చు
నెల్లూరు జిల్లా కావలి వైసీపీలో ఫ్లెక్సీల వివాదం రచ్చకెక్కింది. సీఎం కావలి పర్యటన నేపథ్యంలో ఆ పార్టీలో ఫ్లెక్సీల చిచ్చు రేగింది

నెల్లూరు జిల్లా కావలి వైసీపీలో ఫ్లెక్సీల వివాదం రచ్చకెక్కింది. సీఎం కావలి పర్యటన నేపథ్యంలో ఆ పార్టీలో ఫ్లెక్సీల చిచ్చు రేగింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి తీరుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తమని అవమానస్తున్నారంటూ అసహనంతో ఉన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో.. కావలిలో వెలిసిన ఫ్లెక్సీల్లో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే కన్పించడం వివావాదానికి కారణమైంది. ఫ్లెక్సీల్లో మంత్రులు, కోఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు. దీంతో.. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి తీరుపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసే ఆలోచనలో వైసీపీ నేతలు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story