గంగమ్మ సన్నిధిలో గంజాయి బ్యాచ్‌ ఆకృత్యాలు

గంగమ్మ సన్నిధిలో గంజాయి బ్యాచ్‌ ఆకృత్యాలు
టెంపుల్‌ టౌన్‌ తిరుపతిలో గంజాయి బ్యాచ్‌ హల్‌చల్‌ చేసింది. గంగమ్మ జాతరకు వచ్చి వెళ్తున్న మహిళలు, పిల్లలపై గంజాయి మత్తులో దాడి

టెంపుల్‌ టౌన్‌ తిరుపతిలో గంజాయి బ్యాచ్‌ హల్‌చల్‌ చేసింది. గంగమ్మ జాతరకు వచ్చి వెళ్తున్న మహిళలు, పిల్లలపై గంజాయి మత్తులో దాడి చేశారు కొందరు దుండగులు. అయితే ఇది వైసీపీ వైసీపీ మూకల పనే అంటున్నారు బాధితులు. దాదాపు 15 మంది ఆటోలో వెళ్తున్న భక్తులపై కత్తులు,ఇనుప రాడ్లు, బీరు బాటిళ్లతో దాడి చేసి మహిళా భక్తులపై అసభ్యంగా ప్రవర్తించారని భక్తులు ఆరోపిస్తున్నారు. గంగమ్మ గుడికి వెళ్లే దారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై భక్తులు నిరసన తెలిపారు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ఇందిరా మైదానంలోని వైయస్సార్ విగ్రహం ముందు భక్తుల నిరసనకు దిగారు. న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామంటున్నారు భక్తులు.

Tags

Read MoreRead Less
Next Story