కోడికత్తి కేసు మళ్లీ వాయిదా

కోడికత్తి కేసు  మళ్లీ వాయిదా
కోడికత్తి కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. జూన్‌ 15కి వాయిదా వేసింది ఎన్‌ఐఏ కోర్టు

కోడికత్తి కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. జూన్‌ 15కి వాయిదా వేసింది ఎన్‌ఐఏ కోర్టు. ఎన్‌ఐఏ తరపు న్యాయవాది హాజరు కాకపోవడం, వేసవి సెలవులు కావడంతో విచారణను వాయిదా వేశారు న్యాయమూర్తి. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని గతంలో జగన్‌ తరపు న్యాయవాదులు వాదించారు. అయితే జగన్‌ అభ్యర్ధనపై గతంలోనే అభ్యంతరం తెలిపారు శ్రీను తరపు న్యాయవాది అబ్దుల్ సలీం. ఈ పిటిషన్‌పై వాదనలు జరగాల్సి ఉంది.. అయితే వేసవి సెలవులు కావడంతో విచారణను వాయిదా వేశారు ఎన్‌ఐఏ జడ్జి.

అయితే NIA కోర్టు న్యాయమూర్తి మారడంతో కేసు విచారణ మొదటినుంచి ప్రారంభం కావాల్సి ఉంది.కేసు విచారణ సందర్భంగా సీఎం జగన్ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది అంటున్నారు శ్రీను తరపు న్యాయవాది అబ్దుల్‌ సలీం.

Tags

Next Story