ఏలూరులో పెనుగాలుల బీభత్సం

ఏలూరులో పెనుగాలుల బీభత్సం
ఏలూరు జిల్లాలో గురువారం సాయంత్రం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి

ఏలూరు జిల్లాలో గురువారం సాయంత్రం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ఓ వైపు భారీ వర్షం, మరోవైపు పెనుగాలులతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భీమడోలు మండలంలో పూళ్ళ–కురెళ్ళగూడెం గ్రామాల్లో ఈదురు గాలులకు... కరెంట్ స్థంబాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రహదారి వెంబడి కొబ్బరి చెట్లు, కొమ్మలు పడిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈదురు గాలులకు పూళ్లలో ఖాళీ ఆటో ఏలూరు కాల్వలోకి పల్టీ కొట్టింది. అటు.. ద్వారకా తిరుమల మండలం పి.కన్నాపురంలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. గ్రామానికి చెందిన మహిళ మృతి చెందింది. గ్రామంలో పలు ఇళ్ల పై కప్పులు ఈదురుగాలులకు ఎరిగిపోయాయి. ధాన్యంపై ఉంచిన బరకంపై బరువుకు వేసిన రేకులు సైతం ఎగిరి ఓ యువకుడికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

Tags

Read MoreRead Less
Next Story