విద్యుత్ షాక్‌తో నాలుగు ఏనుగులు మృతి

విద్యుత్ షాక్‌తో నాలుగు ఏనుగులు మృతి
పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ షాక్‌తో నాలుగు ఏనుగులు మృతి చెందాయి

పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ షాక్‌తో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. మరో రెండు ఏనుగులు తృటిలో ప్రమాదం తప్పించుకున్నాయి. భామిని మండలం కాట్రగడ్డ సమీపంలోని పొలాల్లో జరిగిందీ ఘటన. తివ్వాకొండల పై నుంచి ఓ ఏనుగుల గుంపు బొకన్న చెరువులో నీరు తాగేందుకు వచ్చింది. అక్కడే పొలాల్లో కొంత సేపు మేసిన తర్వాత.. అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను నాలుగు ఏనుగులు తాకాయి. దీంతో అవి అక్కడిక్కడే చనిపోయాయి. చనిపోయిన వాటిలో ఒక పిల్ల ఏనుగు, మూడు పెద్ద ఏనుగులు ఉన్నాయి.

నాలుగు ఏనుగులు చనిపోయిన తర్వాత గుంపులోని రెండు ఏనుగులు.. చాలా సేపు అక్కడే ఉన్నాయి. ఆ తర్వాత తివ్వాకొండలపైకి తిరిగి వెళ్లిపోయాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. చనిపోయిన ఏనుగుల కోసం రెండు ఏనుగులు తిరిగొస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఏనుగులు చనిపోయాయని సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. సంఘటన స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు. కొండపైకి వెళ్లిన ఏనుగులు తిరిగి గ్రామాల వైపు రాకుండా చర్యలు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story