నందికొట్కూరులో లోకేష్ పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య ఉత్సాహంగా కొనసాగుతోంది. నందికొట్కూరు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివస్తున్నారు.. జై టీడీపీ, జై లోకేష్ నినాదాలతో విడిది కేంద్రం దద్దరిల్లింది . ఇవాళ 97వ రోజు పాదయాత్ర ఉదయం7 గంటలకు బన్నూరు శివార్లలో క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. లోకేష్ బస చేసిన క్యాంప్ దగ్గర ఆయనతో సెల్ఫీలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపడ్డారు..అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగుతున్నారు. యువనేతను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
నారా లోకేష్‌ను కలసి తమ కష్టాలను చెప్పుకున్నారు కృష్ణారావుపేటమహిళా వ్యవసాయ కూలీలు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకూ పత్తి చెల్లో పనిచేస్తున్నా 200 కూలీ మాత్రమే వస్తుందని,పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ చార్జీలు, గ్యాస్ ధర పెరగడంతో వచ్చే కూలీ బ్రతకడానికి సరిపోవడం లేదని తెలిపారు. ఎక్కువ రోజులు పనులు దొరక్క ఇబ్బంది పడుతున్నమన్నారు. వారి సమస్యలు విన్న లోకేష్ జగన్ పాలనలో విపరీతంగా పన్నుల భారం పెంచారని.నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. కరెంట్ ఛార్జీల దగ్గర నుంచి చెత్త పన్ను వరకూ బాదుడే బాదుడు అని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించి ఎక్కువ రోజులు పనులు దొరికేలా చేస్తామని భరోసా ఇచ్చారు లోకేష్.
ఇక రుద్రవరంలో మైనారిటీలతో భేటీ అయిన లోకేష్ వారి సమస్యలను తెలుసుకున్నారు. పాములపాడులో రైతులతో మాటమంతి కార్యక్రమం నిర్వహించనున్నారు..అక్కడే పాదయాత్రకు భోజన విరామం ఇవ్వనున్నారు. ఇక సాయంత్రం సా.4.15కి కంభాలపల్లె గ్రామస్తులతో సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం శ్రీశైలం నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. ఈ సందర్భంగా శ్రీశైలం, నందికొట్కూరు సరిహద్దు గ్రామస్తులతో లోకేష్ సమావేశం కానున్నారు. ఇక కే.స్టార్ గోడౌన్ దగ్గర విడిది కేంద్రంలో రాత్రికి బస చేయనున్నారు లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com