ఏపీ ప్రభుత్వానికి మరోసారి గట్టి ఎదురుదెబ్బ

ఏపీ ప్రభుత్వానికి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోడ్డుషోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ జగన్ సర్కారు తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింగది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
రాష్ట్రంలో సభలు, సమావేశాలు, రోడ్‌షోలను నిషేధిస్తూ..ఈ ఏడాది జనవరి 2న జగన్ సర్కార్ జీవో నంబర్ 1 తీసుకొచ్చింది. దీనిని సీపీఐ నేత రామకృష్ణ హైకోర్టులో సవాల్ చేశారు. ఇదే జీవోను సవాలు చేస్తూ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు వీర వెంకట రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఏఐఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఐఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రతిపక్షాలు రోడ్డుపై నిర్వహించే కార్యక్రమాలను జీవో నంబర్ 1 పేరుతో అడ్డుకునే ప్రమాదం ఉందని.. అందువల్ల దాన్ని రద్దు చేయాలని కోరారు.
ఆ వ్యాజ్యాలపై జనవరి 24న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం లోతైన విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఆ జీవోను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com