అధికారులపై మహిళల ఉగ్రరూపం.. పెట్రోల్‌ బాటిల్‌తో నిరసన

అధికారులపై మహిళల ఉగ్రరూపం.. పెట్రోల్‌ బాటిల్‌తో నిరసన
రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తుళ్లూరు మండలం దొండపాడులో ఆర్ 5 జోన్‌ పరిధిలో జరుగుతున్న పనులను అడ్డుకున్నారు రైతులు

రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తుళ్లూరు మండలం దొండపాడులో ఆర్ 5 జోన్‌ పరిధిలో జరుగుతున్న పనులను అడ్డుకున్నారు రైతులు. ఆర్ 5 జోన్‌ లో ఇళ్ల స్థలాల పంపిణి కార్యక్రమం నేపధ్యంలో జేసీబీ, ప్రొక్లయినర్లతో భూమి చదును పనులు చేయించేందుకు వచ్చారు సీఆర్డీఏ సిబ్బంది. అయితే సీఆర్డీఏ సిబ్బందిని అడ్డుకొని వాహనాలను వెనక్కు పంపించారు రైతులు.

ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. దొండపాడు చేరుకున్న పోలీసులు,సీఆర్డీఏ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఆర్ 3 జోన్లో పేదల ఇళ్ల స్థలాల కోసం భూములు ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. మరోవైపు మాస్టర్ ప్లాన్ విచ్ఛిన్నం చేసేలా ఆర్ 5 జోన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఆర్ 5 జోన్ పనులను అడ్డుకొని పెట్రోల్ బాటిల్ తో నిరసన తెలిపారు మహిళలు.

Tags

Read MoreRead Less
Next Story