బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. కరెంటు లేక గర్భిణుల అష్టకష్టాలు

బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. కరెంటు లేక గర్భిణుల అష్టకష్టాలు
బాపట్ల ఏరియా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులు. కరెంటు లేకపోవడంతో కాన్పులు సైతం ఆగిపోతున్నట్లు

బాపట్ల ఏరియా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులు. కరెంటు లేకపోవడంతో కాన్పులు సైతం ఆగిపోతున్నట్లు తెలుస్తోంది. జనరేటర్‌ ఉన్నా అది రిపేరు చేయించకపోవడంతో... గర్బిణీలు, రోగులు అవస్థలు పడుతున్నారు. వందమంది గర్భిణీలు ఉండే వార్డులో కనీసం ఫ్యాన్ కూడా తిరగని పరిస్థితి ఉందంటున్నారు రోగులు. పేరుకే బాపట్ల జిల్లా కేంద్ర ప్రధాన వైద్యశాల అని... కానీ పర్మినెంట్ అంబులెన్స్‌ కూడా ఈ ఆసుపత్రి లేదంటున్నారు రోగులు.

వేసవితో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వమే వార్నింగ్‌లు ఇస్తున్నా.. వైద్యాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆసుపత్రిలో కనీసం ఫ్యాన్లు కూడా తిరగని పరిస్థితి ఉంది. ఇక కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదంటున్నారు. దీంతో కాన్పులు సైతం ఆగిపోయాయంటున్నారు ప్రజలు

ఇన్ని సమస్యలు ఉన్నా ఇవేవీ పట్టించుకోవడం లేదు వైద్యాధికారులు. ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామనే ముసుగులో వైసీపీ రంగులపై శ్రద్ధ పెడుతున్నారంటూ విమర్శిస్తున్నారు స్థానిక ప్రజలు. ఇక వైసీపీనేతలు మాత్రం ఆసుపత్రిని అభివృద్ధి చేశామంటున్నారు. కానీ.. ఇక్కడ పరిస్థితి చాలా భిన్నంగా ఉందంటున్నారు రోగులు. ఇప్పటికైనా ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలంటున్నారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story