తాతను కాపాడబోయి ఇద్దరు మనవళ్లు మృతి

తాతను కాపాడబోయి ఇద్దరు మనవళ్లు మృతి
చెరువులో మునిగిపోతున్న తాత నాగమునిని కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు మనవళ్లు మృత్యువాత

తిరుపతి జిల్లా యర్రావారిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగిపోతున్న తాత నాగమునిని కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు మనవళ్లు మృత్యువాత పడ్డారు. నాగముని ఇద్దరు మనవళ్లతో చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నాగముని వలలో చిక్కుకోవడంతో, తాతను కాపాడే ప్రయత్నంలో మనవళ్లు జగదీష్‌, మణికంఠ మృత్యువాత పడ్డారు. ముగ్గురు మరణంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి

Tags

Read MoreRead Less
Next Story