కృష్ణా జిల్లాలో స్మశానాన్ని కూడా వదలని కబ్జాసురులు

కృష్ణా జిల్లాలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. గన్నవరం మండలం వెదురు పావులూరు రెవెన్యూ పరిధిలోని ముస్తాబాద గ్రామంలో బొబ్బా కుటుంబీకులు తమ సొంత స్థలమైన ఆర్‌ఎస్ నెంబర్ 468/2లో 12 సెంట్లలో తమ కుటుంబీకుల సమాధుల కోసం స్థలం వదులుకున్నారు. ఐతే.. అధికార పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని.. తహశీల్దార్‌ను అడ్డం పెట్టుకుని.. నకిలీ దస్తావేజులతో తమ కుటుంబానికి చెందిన స్మశానాన్ని కూడా వదలండం లేదని బొబ్బా రత్నశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమాధులకు కూలగొట్టి అందులో అక్రమ వెంచర్ వేస్తున్నారని తెలిపారు. స్థానిక కోర్టు నుండి ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా పనులు ఆపడం లేదని.. హైకోర్టులోనూ కేసు పెండింగ్‌లో ఉందని తెలిపారు. తమ స్థలంలో బోర్డు పెట్టేందుకు వెళ్తే గన్నవరం పీఎస్‌కు పిలిపించి బెదిరించారని రత్నశేఖర్ వాపోయారు. గన్నవరం పోలీసులను తహశీల్దార్‌ను విచారించాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com