AP : అభయారణ్యంలో చేపల చెరువు తవ్వకాలు

AP : అభయారణ్యంలో చేపల చెరువు తవ్వకాలు

కొల్లేరు అభయారణ్యంలో అధికారపక్షం నేతలు అక్రమంగా చేపల చెరువు తవ్వకాలకు తెరలేపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, భీమవరం పరిసర ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా నిరంతరం తవ్వకాలు జరుగుతున్నా.. అటవీ, రెవెన్యూ అధికారులు అటువైపే చూడడం లేదు. ఈ నేపథ్యంలో.. అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైసీపీ నాయకుల కనుసన్నల్లో.. నిబంధనలకు విరుద్ధంగా కొల్లేరులో అక్రమంగా చేపల చెరువు తవ్వకాలు సాగుతున్నాయి. వేసవిలోనే పెద్ద ఎత్తున ఆక్రమణకు వ్యూహాన్ని రచించారు. ఆకివీడులో వైసీపీ నేతల అండతోనే ఆయన అనుచరుల సమక్షంలో కొల్లేరులో తవ్వకాలు జరుగుతున్నా... కాసులకు కక్కుర్తిపడి అటవీ, రెవిన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story