బటన్ నొక్కి రెండు నెలలౌతున్న అందని ఆసరా సొమ్ము

బటన్ నొక్కితే చాలు అకౌంట్‌లో డబ్బులు పడుతాయంటూ డ్వాక్రా మహిళలతో ఎంతో ఆర్బాటంగా ప్రకటించారు సీఎం జగన్. బటన్ నొక్కి దాదాపు రెండు నెలలవుతున్నా కానీ ఇప్పటి వరకు ఆసరా సొమ్ము పడలేదు. దీంతో జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతిని నిలదీశారు డ్వాక్రా మహిళలు. యల్లనూరు మండలం శింగవరం గ్రామంలో... గడప గడప కార్యక్రామాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే. అయితే ఎస్సీ కాలనీలో వెళ్లిన ఎమ్మెల్యే పద్మావతికి.. చుక్కెదురైంది. డ్వాక్రా సొమ్ము ఎప్పుడు పడతాయంటూ నిలదీశారు. అంతేకాదు.. తమ కాలనీలో డ్రైనేజీ సమస్యపైనా ఎమ్మెల్యేను నిలదీశారు. దీనికి ఎమ్మెల్యే సమాధానం చెప్పలేక అక్కడినుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన వారిని గన్‌మెన్, పోలీసులు అడ్డుకుని దూరంగా పంపించారు
డ్వాక్రా మహిళలకు ఆసరా పేరుతో వైసీపీ సర్కారు అమలు చేస్తోన్న మూడోవిడుత రుణమాఫీ సొమ్ము కోసం మహిళలు ముప్పుతిప్పలు పడుతున్నారు. మార్చి 25న ఆసరా డబ్బులు ఇస్తున్నామంటూ.. అప్పట్లో బటన్ నొక్కారు సీఎం జగన్. అయితే దాదాపు రెండు నెలలవుతున్నా ఇప్పటి వరకు డబ్బులు జమ కాలేదు. ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయంటూ పలు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు డ్వాక్రా మహిళలు . అంతేకాదు ఈ సొమ్ము కొందరికి మాత్రమే రావడం, మరికొందరికి రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసరా డబ్బులపై మహిళలు ప్రశ్నిస్తుండంతో వైసీపీ ఎమ్మెల్యేలు నీళ్లు నములుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com