AP : ఆర్ 5 జోన్‌కి వ్యతిరేకంగా పంచాయతీల ఏకగ్రీవ తీర్మానం

ఆర్ 5 జోన్ పై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాదనలు అనంతరం వాయిదా పడింది. భోజన విరామం అనంతరం తిరిగి వాదనలు కొనసాగున్నాయి. రైతుల తరపున సుదీర్ఘవాదన లు వినిపించారు సీనియర్ న్యాయవాదులు శ్యాందివాన్, రంజిత్ కుమార్. ఆర్ 3 జోన్ లోనే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఆర్డీఏ చట్టంలో ఉందన్న శ్యాందివాన్.. సీఆర్డీఏ చట్టాన్ని తప్పుగా సవరించి ఆర్ 5 జోన్ లో ఇళ్ల స్థలాలను కేటాయించాలని భావిస్తున్నారన్నారు. ఎలక్ట్రానిక్ సిటీలో ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల రాజధాని రూపు రేఖలు మారిపోతాయని శ్యాందివాన్ వాదనలు వినిపించారు. ఆర్ధిక వృద్దికి, ప్రగతికి అవరోధం ఏర్పడటమే కాకుండా రైతులకు కూడా తీరని నష్టం కలుగుతుందని వాదించారు.
ఆర్ 5 జోన్‌కి వ్యతిరేకంగా రాజధాని పరిధిలోని అన్ని పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపాయని... 5వేలకు పైగా అభ్యంతరాలు కూడా వచ్చాయని వాదనలు వినిపించారు. వీటిని పరిగణలోకి తీసుకోకుండా సీఆర్డీఏ చట్టసవరణ చేశారని... హైకోర్టు రాజధానిపై చట్టం చేసే శాసనాధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. అయినా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేశారన్నారు శ్యాం దివాన్. కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తులు విచారణ నుంచి వైదొలగారన్నారు రైతుల తరుపు న్యాయవాది రంజిత్ కుమార్. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే స్థలాల కేటాయింపుల ప్రక్రియ ప్రారంభించారన్నారు రంజిత్ కుమార్..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com