AP : రేపు,ఎల్లుండి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి

AP : రేపు,ఎల్లుండి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు.. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో రేపు,ఎల్లుండి పర్యటించనున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌ కోళ్ల లలితకుమారి ఆధ్వవర్యంలో.. ఈ కార్యక్రమం జరుగనుంది. విశాఖ జిల్లా పెందుర్తి నుంచి కొత్త వలస చేరుకోనున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలకనున్నారు టీడీపీ నేతలు. అక్కడ నుంచి ఎస్‌ కోటలో శిరికి రిసార్ట్‌కు చేరుకుంటారు. అనంతరం.. పుణ్యగిరి, వివేకానంద కళాశాల మీదుగా.. ఎస్‌ కోట దేవిగుడి కూడలి వరకు రోడ్‌షోలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. చంద్రబాబు పర్యటకు అన్ని ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు.

Tags

Next Story