వైసీపీ ఎమ్మెల్యే రెడ్డిశాంతిపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు

వైసీపీ ఎమ్మెల్యే రెడ్డిశాంతిపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. సొంత పార్టీ నేతలే వైసీపీ ఎమ్మెల్యే రెడ్డిశాంతిపై తిరుగుబాటు చేశారు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. సొంత పార్టీ నేతలే వైసీపీ ఎమ్మెల్యే రెడ్డిశాంతిపై తిరుగుబాటు చేశారు. ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటూ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నల్లబ్యాడ్జీలతో ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతికి బుద్ధి చెప్పాలి అంటూ ప్లేకార్డుల ప్రదర్శించారు.

5 మండలాల వైసీపీ కార్యకర్తలు సైతం రెడ్డిశాంతిపై తీవ్రంగా మండిపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడితే తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రెడ్డిశాంతికి ఈసారి టికెట్ ఇస్తే సహకరించేది లేదని వైసీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు మూకుమ్మడిగా తేల్చిచెప్పారు.


Tags

Read MoreRead Less
Next Story