AP : రేపటి నుంచి ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ సేవలు

ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకి నోటీసు ద్వారా తెలియజేసింది.. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నాయి ఆస్పత్రులు.. బకాయిలు భారీగా పేరుకుపోవడంతోనే ఈనిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి. బకాయిల విషయంలో ఏపీ ప్రభుత్వం హామీని నెరవేర్చకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు చెబుతున్నాయి.
ఆరోగ్యశ్రీ కింద ఏపీలో నెట్‌వర్క్ ఆస్పత్రులకు భారీగా బకాయిలు పెరిగిపోయాయి. దాదాపు 2వేల కోట్ల రూపాయలకు పైగా ఆ్పత్రులకు ప్రభుత్వం బకాయిపడింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల యజమానులు చేతులెత్తేశారు. సేవలు నిలిపివేయాలని జిల్లాల వారీగా ఏకగ్రీవ తీర్మానానికి ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆమోదం తెలిపాయి. మే 1 నుంచే వైద్య సేవలు నిలిపివేయాలని నిర్ణయించగా.. ప్రభుత్వం ఈనెల 200 కోట్లు బకాయిల నిమిత్తం విడుదల చేసింది.. కానీ, ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు దాదాపు రెండు వేల కోట్లకుపైగా ప్రభుత్వం బకాయి పడింది.. అయితే, ఈ బకాయిల కారణంగా ఆరోగ్య శ్రీ సేవలు అందించలేమని నెట్‌వర్క్ ఆస్పత్రులు స్పష్టం చేశాయి.. రేపట్నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనుండటంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com