వైసీపీ నాయకులు రైతుల భూములు లాక్కుంటున్నారు : లోకేష్

వైసీపీ నాయకులు రైతుల భూములు లాక్కుంటున్నారు : లోకేష్

రాయలసీమ రైతులకు నీరు అందిస్తే బంగారం పండిస్తారని అన్నారు నారా లోకేష్. టీడీపీ అధికారంలోకి వచ్చాక... రాయలసీమలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. టిడిపి హయాంలో ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అమ్మాలి అంటే భయపడేవారు. జగనే 420 కాబట్టి ఇప్పుడు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. జగన్ చేతగానితనాన్ని వాతావరణం పై తోసేసి రైతులకు అన్యాయం చేసారు.

వైసిపి నాయకులు రైతుల భూములు లాక్కుంటున్నారు. మంత్రి బుగ్గన నియోజకవర్గంలో రైతు రవికి అన్యాయం జరిగితే కనీసం స్పందించలేదు. బుగ్గన అనుచరులే రైతుల పై దౌర్జన్యానికి పాల్పడ్డారు. రవికి టిడిపి అండగా ఉంటుంది. రాబోయేది టిడిపి ప్రభుత్వమే మీ భూమి మీకు ఇచ్చే బాధ్యత నాది. రైతులను వైసిపి ప్రభుత్వం నిత్యం అవమానపరిస్తుంది. ధాన్యం కొనమని అడిగితే ఎర్రిపప్ప అని తిట్టి రైతులను అవమానించారు ఒక మంత్రి. టిడిపి హయాంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం 11,700 కోట్లు ఖర్చు చేసాం. వైసిపి హయాంలో కనీసం టిడిపి చేసిన దాంట్లో 10 శాతం కూడా ఖర్చు కూడా చెయ్యలేదు. కర్నూలు నుంచి వలసలు వెళ్తున్న వ్యవసాయ కూలీలతో మాట్లాడిన తరువాత నాకు బాధ కలిగింది.

టిడిపి హయాంలో నీటిని సమర్థవంతంగా వాడుకోవడం కోసం 7 లక్షల పంట కుంటలు కూడా తవ్వాం. గోదావరి, కృష్ణా , పెన్నా అనుసంధానం ప్రక్రియ ప్రారంబించింది టిడిపి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే నదుల అనుసంధానం ప్రక్రియ పూర్తి చేస్తాం. గుండ్రేవుల ప్రాజెక్టు టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తి చేస్తాం. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు అన్ని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తాం. పాలిచ్చే ఆవు వద్దనుకొని తన్నే దున్నపోతు ని తెచ్చుకున్నారు. టిడిపి హయాంలో 50 వేలు లోపు ఉన్న రుణాలు అన్ని ఒక్క సంతకం తో రద్దు చేసాం.

భూసార పరీక్షలు, మైక్రో నూట్రియెంట్స్, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్స్యూరెన్స్, గిట్టుబాటు ధర, వ్యవసాయ పరికరాలు,రైతు రథాలు అందించాం. జగన్ పాలనలో గిట్టుబాటు ధర లేదు, రూ.3500 ధరల స్థిరీకరణ నిధి అన్నాడు ఆ నిధి ఎక్కడికి పోయింది, ఇన్స్యూరెన్స్ లేదు, రైతు రుణాలు ఇవ్వడం లేదు, వ్యవసాయం చెయ్యడానికి పరికరాలు, యంత్రాలు ఇవ్వడం లేదు. ఎన్నికల ముందు రైతు భరోసా రూ.12,500 ఇస్తాను అని చెప్పి ఇప్పుడు కేవలం రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు. ఒక్కో రైతుకి రూ.25 వేలు మోసం చేశాడు జగన్. ప్రతి ఏడాది గిట్టుబాటు ధరలు ప్రకటిస్తాం అని హామీ ఇచ్చి మోసం చేశాడు జగన్.

Tags

Read MoreRead Less
Next Story