సబ్ స్టేషన్ వద్ద లాంతరు వెలుగులో నిద్ర చేసిన ఎమ్మెల్యే నిమ్మల

సబ్ స్టేషన్ వద్ద లాంతరు వెలుగులో  నిద్ర చేసిన ఎమ్మెల్యే నిమ్మల
ఏపీలో అప్రకటిత కరెంట్ కోతలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు కోతలకు నిరసనగా గురువారం గుడివాడలో ఆందోళన చేయగా

ఏపీలో అప్రకటిత కరెంట్ కోతలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు కోతలకు నిరసనగా గురువారం గుడివాడలో ఆందోళన చేయగా ఇవాళ ఏకంగా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన చేపట్టారు. అప్రకటిత కరెంటు కోతలకు నిరసనగా విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద లాంతరు వెలుగులో నిద్ర చేశారు. ఇంట్లో పడుకుంటే ఉక్క పోత, బయట పడుకుంటే దోమల మోతగా ఉందంటూ ఫైర్ అయ్యారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలను నిలిపివేసి నాణ్యమైన కరెంట్ అందించకపోతే వేలాది మందితో విద్యుత్ సబ్ స్టేషన్ ముందు లాంతర్లు తో నిరసన చేస్తామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story