తాడేపల్లిలో ఆగని అక్రమ మైనింగ్

కొత్తూరు తాడేపల్లిలో అక్రమ మైనింగ్ ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. అక్రమార్కులు యథేచ్ఛగా కోట్లరూపాయలు విలువచేసే మట్టిని తరలిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ను కట్టడి చేయాలని గతంలో NGT ఆదేశాలు జారీ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. NGT బృందం ఇప్పటికే రెండు సార్లు కొత్తూరు తాడేపల్లిలో పర్యటించింది. అయితే మైనిగ్‌పై ఇప్పటికే ఓ బృందాన్ని ఏర్పరిచినప్పటికీ తుది నివేదిక ఇవ్వకపోవడంతో బృందంపై NGT అసహనం వ్యక్తం చేసింది. మైనింగ్ మాఫియాపై NTR జిల్లా కలెక్టర్,CP కి పిల్లి సురేంద్రబాబు మెమరాండం ఇచ్చారు. ఈ క్రమంలో మాఫియాను ప్రశ్నిస్తున్న స్థానికులపై దాడులకు తెగబడుతున్నారంటూ పిటిషనర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ జరుగకుండా నిలువరించాలని కలెక్టర్,సీపీకి NGT నోటీసులు జారీ చేసింది. అయితే మాఫియాపై ఈనెల 24న మరో మారు NGT విచారణ చేపట్టనున్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com