విశాఖ వివాదాస్పద భూముల్లో శరవేగంగా నిర్మాణాలు

విశాఖ వివాదాస్పద భూముల్లో శరవేగంగా నిర్మాణాలు

విశాఖలో అత్యంత విలువైన వివాదాస్పద భూముల్లో శరవేగంగా నిర్మాణాలు జరిగిపోతున్నాయి. కోట్లు విలువ చేసే భూములు అక్రమంగా చేతులు మారిపోతున్నాయి. ఇదేంటని ప్రశ్నించే అధికారులపై బదిలీ వేటు వేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో బహుళ అంతస్తులు, భవనాల కోసం యధేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. సీబీసీఎన్సీ భూములే అందుకు నిదర్శనం కాగా.. దసపల్లాహిల్స్‌లో 22ఏ నిషేధిత భూములను అరబిందోకు అప్పగించి నిర్మాణాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. విశాఖలో అధికార వైసీపీ పెద్దలది ఇష్టారాజ్యంగా మారిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Next Story