వైసీపీ ఎమ్మెల్యే కాటసానికి చేదు అనుభవం

వైసీపీ ఎమ్మెల్యే కాటసానికి చేదు అనుభవం

వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. నంద్యాల జిల్లా భూపనపాడులో నిరసన సెగ తగిలింది. V.C కాలనీలోకి రావొద్దంటూ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డిని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. సర్పంచ్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రోడ్డు కూడా ఎందుకు వేయలేదంటూ నిలదీశారు. మరోవైపు నిరసన వీడియోలు తీస్తున్న యువకుల సెల్‌ఫోన్లను లాక్కొన్న ఎమ్మెల్యే అనుచరులు వాటిని డిలీట్‌ చేశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులకు, యువకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story