సీఎం జగన్‌పై నాగబాబు ఫైర్

సీఎం జగన్‌పై నాగబాబు ఫైర్
X

ముఖ్యమంత్రి జగన్‌పై జనసేన నేత నాగబాబు మరోసారి విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను జగన్, వైసీపీ నేతలు ప్యాకేజీ స్టార్ అనడంపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కథాకళి ఎపిసోడ్‌ త్రీలో కింగ్ ఆఫ్ ప్యాకేజ్ జగన్‌రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో జనసేన నాయకుడు అజయ్‌తో కలిసి కథాకళి కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు.. జగన్ ప్యాకేజీ బాగోతాలను బట్టబయలు చేశారు. రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తి దగ్గర ప్యాకేజీ తీసుకుని.. రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. సీఎం అవడానికి 15 వందల కోట్ల ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధమైన నిజమైన ప్యాకేజీ స్టార్‌ జగన్‌రెడ్డి అంటూ నాడు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రసంగాన్ని బయటపెట్టారు. అటు జగన్ ప్యాకేజీ గుట్టును బయటపెట్టిన కథాకళి కార్యక్రమం బాగుందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

Next Story