టీడీపీ మ్యానిఫెస్టోతో జగన్ కు నిద్ర పట్టడం లేదు

టీడీపీ మ్యానిఫెస్టోతో జగన్ కు నిద్ర పట్టడం లేదు

చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల గుండెల్లో నుంచి వచ్చిందని అన్నారు ఏపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఇది ట్రైలర్ మాత్రమేనని మేనిఫెస్టో దెబ్బకు సీఎం జగన్ కు నిద్రపట్టడంలేదని అన్నారు. టిడిపి మేనిఫెస్టో పై విమర్శలు చేసే ముందు మీ మ్యానిఫెస్టోని ప్రజలు బంగాళాఖాతంలో కలిపారని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని అన్నారు. దసరాకి విడుదల చేసే మేనిఫెస్టో కి వైసీపీ నేతలు ఏమైపోతారోనని ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్రను వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. లోకేష్ పాదయాత్రను సాగనిస్తే మంచిది.... లేదంటే ఆయన దండయాత్ర చేస్తాడు.

Read MoreRead Less
Next Story