హిందూపురం వైసీపీలో అసమ్మతి..14 మంది వైసీపీ కౌన్సిలర్లు రాజీనామా?

హిందూపురం వైసీపీలో అసమ్మతి..14 మంది వైసీపీ కౌన్సిలర్లు రాజీనామా?

సత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీలో అసమ్మతి రాగం వినిపిస్తోంది. 38మంది కౌన్సిలర్లకు గానూ 30మంది కౌన్సిలర్లు వైసీపీకి చెందిన వారే. అయితే 14 మంది వైసీపీ కౌన్సిలర్లు రాజీనామాలకు సిద్ధం అయ్యారనే ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్‌కు వ్యతిరేకంగా వీరంతా అసమ్మత గళం వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధిపై ఛైర్మన్ ఇంద్రజను వైసీపీ కౌన్సిలర్లు నిలదీశారు. ఎమ్మెల్సీ ఇక్బాల్, ఇంద్రజ స్పందించకపోవడంతోనే రాజీనామాల అస్త్రం ప్రయోగిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కౌన్సిలర్ల రాజీనామాపై వాట్సాప్‌ గ్రూప్‌లో ఓ మెసేజ్ హల్‌చల్ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story