వివేకాను హత్య చేస్తే 40 కోట్లు..సీబీఐ దర్యాప్తులో వెల్లడి

వివేకా హత్య కేసులో అరెస్టయిన భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిల ఆరు రోజుల విచారణ ముగిసింది. దీంతో ఇద్దరిని సీబీఐ న్యాయస్థానంలో హాజరుపరిచి, అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. వివేకాను హత్య చేస్తే 40 కోట్లు ముడతాయని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడి అయ్యింది. ఇంత పెద్దమొత్తం సమకూర్చేందుకు నిందితులకు ఉన్న ఆర్థిక వనరులేమిటని తెలుసుకునేందుకే సీబీఐ అధికారులు చివరి రోజు భాస్కరరెడ్డి ఆర్థిక స్థితిగతులపై ఆరా తీసినట్లు సమాచారం. హత్య జరగడానికి ముందు భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డిల బ్యాంకు లావాదేవీలు, ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆర్థిక వివరాలు, ఆదాయపన్ను రిటర్న్‌ల వంటివాటిని సీబీఐ అధికారులు సేకరించి పెట్టుకుని, వాటి ఆధారంగానే ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com