వైసీపీ ఎమ్మెల్యేను అడ్డుకున్న ఆదివాసీలు..జీవో నెంబర్ 52ను రద్దు చేయాలని డిమాండ్

వైసీపీ ఎమ్మెల్యేను అడ్డుకున్న ఆదివాసీలు..జీవో నెంబర్ 52ను రద్దు చేయాలని డిమాండ్

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో వైసీపీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేను ఆదివాసీలు, నాయకులు అడ్డుకున్నారు. జీవో నెంబర్ 52ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో రద్దుపై హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి పంపిస్తామని ఎమ్మెల్యే ధనలక్ష్మికి ఆదివాసీలు ఘెరావ్ చేశారు.

జీవో నెంబర్ 52 రద్దు చేయాలని వైసీపీ ఎమ్మెల్యేను ఆదివాసీలు నిలదీశారు. అయితే ఇచ్చిన హామీపై స్పష్టత ఇవ్వకుండా ఆ నెపాన్ని టీడీపీపై నెట్టే ప్రయత్నం చేసారు. టీడీపీకి రాజీనామా చేస్తే మీకు న్యాయం చేస్తానంటూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆదివాసీలు వైసీపీ ఎమ్మెల్యేపై తీవ్రంగా మండిపడ్డారు. జీవో నెంబర్ 52 రద్దు చేస్తామని హామీ ఇచ్చింది వైసీపీ అని.. టీడీపీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. మీరు ఎమ్మెల్యేగా ఉండి ఆదివాసీలకు ఏంచేసారని? ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోరని ప్రశ్నల వర్షం కురిపించారు.

బోయ వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీలలో చేరుస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఆదివాసీలు, గిరిజనలు భగ్గుమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జీవో నెంబర్ 52ను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతున్నారు. ఆందోళనలో భాగంగా మారేడుమిల్లిలోను ఆదివాసీలు రోడ్డెక్కారు. జీవోను రద్దు చేయించలేని ఎమ్మెల్యే గిరిజన ద్రోహి అంటూ నినాదాలు చేశారు. గిరిజనులకు అన్యాయం చేసే జీవో రద్దు చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు.


Tags

Next Story