పీలేరులోనే 601 ఎకరాలు దోచుకున్నారు..సీఎం జగన్‌కు లోకేష్ లేఖ

పీలేరులోనే 601 ఎకరాలు దోచుకున్నారు..సీఎం జగన్‌కు లోకేష్ లేఖ
X
భూఅక్రమాలపై సీఐడీ లేదా సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్‌

ఏపీ సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ రాశారు. పీలేరు నియోజకవర్గంలోని భూఅక్రమాలపై సీఐడీ, లేదా సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. గతంలో కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను కూడా జతచేశారు లోకేష్‌. రాష్ట్రంలో భూ మాఫియాకు వ్యతిరేకంగా టీడీపీ పోరాటం చేస్తుందని, ఒక్క పీలేరు నియోజక వర్గంలోనే అధికార పార్టీ నేతలు 601 ఎకరాలను దోచుకున్నారని మండిపడ్డారు. గతంలో ఇదే అంశంపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్నారు. భూకబ్జాలకు పాల్పడిన ల్యాండ్‌ మాఫియాపై ఎందుకు చర్యలు తీసుకోరని, ప్రజా ప్రయోజనాల కంటే వైసీపీ నేతల ప్రయోజనాలే ముఖ్యమా..? అని ప్రశ్నించారు. గతంలో పీలేరు ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని లోకేష్ లేఖలో ప్రశ్నించారు.

Tags

Next Story