రుషికొండ నిర్మాణాలకు జీవీఎంసీ ప్రణాళిక మంజూరు

విశాఖ రుషికొండలో పర్యాటక శాఖ చేపట్టిన నిర్మాణాలకు జీవీఎంసీ ప్రణాళికను మంజూరు చేసింది. సంబంధిత దరఖాస్తుకు కమిషనర్ రాజాబాబు ఆమోదం తెలిపారు. దాదాపు నిర్మాణాలు పూర్తవుతున్న దశలో దీన్ని మంజూరు చేయడం విశేషం. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక ఇంజినీరు కె.రమణ జీవీఎంసీకి పంపిన మొదటి ప్లాన్‌లో 12.46 ఎకరాలకు 9.88 ఎకరాల్లో నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. న్యాయస్థానానికి నివేదించిన ప్రకారం ప్రస్తుతం 2.88 ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులో మరింత విస్తరించాలనే వ్యూహంతో మొత్తం ప్రణాళికను మార్చేశారు.
రుషికొండపై నిర్మాణాలకు సంబంధించి జీవీఎంసీకి 19 కోట్ల భవన నిర్మాణ రుసుములను అయిదేళ్లలో దశల వారీగా చెల్లించేలా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాన్‌లో వేంగి, గజపతి, కళింగ, విజయనగరం బ్లాకులలో గ్రౌండ్, మొదటి అంతస్తుల నిర్మాణానికి అనుమతి కోరారు. ఇదిలా ఉండగా.. రుషికొండను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఆందోళన చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com