వైసీపీ మేయర్‌పై సొంత కార్పోరేటర్ల తిరుగుబాటు

వైసీపీ మేయర్‌పై సొంత కార్పోరేటర్ల తిరుగుబాటు
రసాభాసగా మారిన అనంతపురం నగరపాలక సంస్థ సమావేశం

అనంతపురం నగరపాలక సంస్థ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ మేయర్‌పై.. వైసీపీ కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. డివిజన్లలో సమస్యలు పరిష్కరించాలని ఏళ్ల తరబడి కోరుతున్నా ఫలితం లేదంటూ ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపకుండా ఇంకెంత కాలం కాలయాపన చేస్తారని మేయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్‌కు వ్యతిరేకంగా నేలపై కూర్చుని నిరసన తెలిపారు. సొంత పార్టీ కార్పొరేటర్లే ఆందోళనకు దిగడంతో.. మేయర్ వసీం ఖంగుతిన్నారు. డయాస్ దిగి వచ్చి సొంత పార్టీ కార్పొరేటర్లను బుజ్జగించే ప్రయత్నం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story