టిడ్కో ఇళ్లు.. ఇంకెన్నాళ్లు..!!

టిడ్కో ఇళ్లు.. ఇంకెన్నాళ్లు..!!
టిడ్కో ఇళ్ల నిర్మాణంలో ఆలస్యంపై కేంద్రం సీరియస్‌

టిడ్కో ఇళ్ల నిర్మాణంలో ఆలస్యంపై కేంద్రం సీరియస్‌ అయింది.ఇళ్లను పూర్తి చేయడానికి ఇంకెంత సమయం కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. లబ్ధిదారులకు ఎప్పుడు అందిస్తారని ప్రశ్నించింది. ఈ నేపధ్యంలో టిడ్కోకు కేంద్రం లేఖ రాసింది. సమాచారం. కేంద్ర, రాష్ట్ర అధికారుల సమావేశాల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో రాష్ట్ర అధికార గణం తలలు పట్టుకుంటున్నారు. అయితే ఏప్రిల్‌లో 50 వేలు,జూన్‌ లో మరో 50 వేల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని కేంద్రానికి టిడ్కో అధికారులు సమాధానమిచ్చినట్లు సమాచారం. మరోవైపు కాంట్రాక్ట్ సంస్థలకు దాదాపు ఏడు వందల కోట్లు చెల్లించాల్సి ఉంది. బకాయిలు విడుదల చేస్తేనే ఇళ్ల పనుల్లో వేగం పెంచుతామని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి తెలిపినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story