కారుణ్య నియామకాలు ఇవ్వాలి..ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల ఆందోళన

కారుణ్య నియామకాలు ఇవ్వాలి..ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల ఆందోళన

విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన బాటపట్టాయి. అర్హత కలిగిన వారందరికి కారుణ్య నియామకాలు ఇవ్వాలని ఆర్టీసీ హౌస్ ముందు ధర్నాకు దిగారు. 2016 ముందు విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2016 తర్వాత ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలిచ్చారని... తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ బాటిల్స్ తమ వెంట తెచ్చుకున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు.. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story