ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు.. పరిస్థితులు ఉద్రిక్తం

ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు.. పరిస్థితులు ఉద్రిక్తం

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ జలదీక్షకు కోటంరెడ్డి పిలుపునివ్వడంతో.. అర్ధరాత్రి నుంచి కోటంరెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. గత నాలుగేళ్లుగా పొట్టేపాలెం కలుజుపై వంతెన సాధన కోసం కోటంరెడ్డి పోరాటం చేస్తున్నారు. అయితే జలదీక్షకు వారం ముందు పోలీసుల అనుమతి కోరారు కోటం రెడ్డి. అయినా పోలీసులు ఇంటిని చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

అటు.. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి జలదీక్షకు అనుమతులు నిరాకరిస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాహనాల రాకపోకలకు అంతరాయం… జలదీక్షకు అందరు వస్తారో సమాచారం ఇవ్వకపోవడం… ప్రజలకు ప్రమాదం జరిగే అవకాశం.. అవాంఛనీయ ఘటనలకు బాధ్యత.. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో అనుమతులు నిరాకరిస్తున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story