ఎమ్మెల్యే పుట్టినరోజు.. కేక్‌ కట్‌ చేసిన ఖాకీలు

ఎమ్మెల్యే పుట్టినరోజు.. కేక్‌ కట్‌ చేసిన ఖాకీలు

తిరుపతి జిల్లా సత్యవేడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బర్త్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో.. సత్యవేడు సీఐ శివకుమార్‌ రెడ్డి, వరదయ్యపాలెం ఎస్‌ఐ నాగార్జున రెడ్డి, సత్యవేడు ఎస్సై పురుషోత్తం రెడ్డి, నాగాలాపురం ఎస్‌ఐ హనుమంతప్ప కేక్‌ కట్‌ చేయించారు. ఎమ్మెల్యే ను గజమాలతో సత్కరించారు. నిబంధనలు ఉల్లంగిస్తూ విధులు నిర్వహించకుండా సెలబ్రేషన్స్‌ చేశారని.. ఎమ్మెల్యేపై భక్తి చాటుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story