ఉదయగిరిలో యదేచ్చగా గ్రావెల్‌ మాఫియా

ఉదయగిరిలో యదేచ్చగా గ్రావెల్‌ మాఫియా
జలదంకి పెద్ద చెరువులో అక్రమంగా గ్రావెల్‌ను రవాణా. మాఫియాను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నా యధేచ్ఛగా తరలించేస్తున్నారు

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. జలదంకి పెద్ద చెరువులో అక్రమంగా గ్రావెల్‌ను రవాణా చేస్తున్నారు. గ్రావెల్ మాఫియాను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నా.. యధేచ్ఛగా తరలించేస్తున్నారు. అనుమతులు లేకుండా లారీలతో గ్రావెల్‌ను వెంచర్లకు అక్రమంగా రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల సహకారంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story