మహిళపై నోరు పారేసుకున్న మంత్రి జోగి రమేష్

మహిళపై నోరు పారేసుకున్న మంత్రి జోగి రమేష్
ఇళ్లు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని మంత్రిని మహిళ నిలదీసింది. దాంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న మంత్రి.. అరవద్దు, ఎక్కవ మాట్లా

ఏపీ మంత్రి జోగి రమేష్ మరోసారి పేదలపై నోరు పారేసుకున్నారు. అధికారులతో కలిసి పెడనలో ఒకటో వార్డులోని పైడమ్మ కాలనీని సందర్శించారు మంత్రి. సమస్యలు తెలుసుకుందామని వెళ్లిన జోగి రమేష్‌కు ఒక్కసారిగా నిరసన సెగలు తగిలాయి. ఇళ్లు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని మంత్రిని మహిళ నిలదీసింది. దాంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న మంత్రి.. అరవద్దు, ఎక్కవ మాట్లాడొద్దు అంటూ మహిళపై చిందులేశారు. బయటకు వెళ్లు అంటూ బెదిరించారు. అయినా వెనక్కు తగ్గని పైడమ్మ కాలనీవాసులు.. తమ కాలనీ సమస్యలు పరిష్కరించాలంటూ అడిగారు. దానికి సంబంధిత అధికారులకు చెప్తానని జోగి రమేష్ తెలపగా.. ఎప్పుడూ ఇలాగే చెప్తున్నారని మహిళలు నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story