షురూ అయిన హస్తం నేతల సత్యాగ్రహ దీక్ష

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష ప్రారంభమైంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా రాజీవ్‌గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో హస్తం నేతలు దీక్షకు దిగారు. దేశమంతా బీజేపీ వ్యవహార శైలిని గమనిస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ తన అధికార నివాసాన్ని ఖాళీ చేస్తున్న సమయంలో దేశంలోని ప్రజలు కంట తడిపెట్టారన్నారు. స్వాతంత్రం కోసం గాంధీ కుటుంబం తమ ఆస్తులను త్యాగం చేసిందని గుర్తుచేశారు.
రాహుల్ గాంధీని బిజెపి అనేక విధాలుగా వేధిస్తోందని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దేశ్వర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రజలను కలుస్తుంటే బిజెపికి భయం పట్టుకుందన్నారు. పార్లమెంట్‌లో అధిక శాతం నేరచరిత్ర కలిగిన ఎంపీలే ఉన్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మోదీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com