Guntur : పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయండి : కలెక్టర్

సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా..పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా కలెక్టర్. అయితే మరోవైపు అమరావతిలోని ఆర్ 5 జోన్‌లో రాజధానేతర పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా జగన్ సర్కార్ పట్టుదలగా వ్యవహారిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కోర్టు పరిధిలో ఉన్నా నివాస స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్లను పిలవాలని సీఆర్‌డీఏను ఆదేశించింది.దీనిపై రాజధాని రైతులు ఆందోళన చెందారు. తమ నుంచి తీసుకున్న భూముల విషయంలో భూ సమీకరణ ఒప్పందాలు, రాజధాని మాస్టర్ ప్లాన్, సీఆర్‌డీఏ చట్టాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని హైకోర్టును ఆశ్రయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com