AP : వైసీపీ శ్రేణులు ముస్లింలపై దాడులు చేస్తున్నారు : లోకేష్

రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టే చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కోరారు.. ముస్లిం, మైనార్టీలపై దాడులు చేసే నేరస్థుల్ని ప్రోత్సహించేలా వైసీపీ ప్రభుత్వ చర్యలున్నాయని గవర్నర్‌కు లేఖ రాశారు.. చాలా ఘటనల్లో వైసీపీ శ్రేణులే ముస్లిం మైనార్టీలపై దాడులకు పాల్పడితే అధికార పార్టీ ఒత్తిడితో కొంతమంది పోలీసులు నేరస్థులతో చేతులు కలిపి కేసులు నీరుగార్చుతున్నారని మండిపడ్డారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై చోటు చేసుకుంటున్న 50 సంఘటనలు, తన దృష్టికి వచ్చిన సంఘటనల వివరాలను లేఖకు జత చేశారు.. వైసీపీ వేధింపుల వల్ల నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య, పల్నాడు ప్రాంతంలో ముస్లిం మైనార్టీల ఆస్తులపై దాడులు, హత్యలు, గెంటివేత అంశాలు, పులివెందుల సహా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న ఘటనలను సవివరంగా లేఖకు జత చేశారు.
లౌకిక వాదంపై జరిగే దాడుల్లో గవర్నర్ జోక్యం అవసరమని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలను మరింత వెనుకబాటుతనం, పేదరికంలోకి నెట్టే విధంగా వైసీపీ ప్రభుత్వ చర్యలున్నాయన్నారు.. ముస్లిం మైనార్టీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు.. ఆస్తుల కూల్చివేత, బౌతిక దాడులు, ఆత్మహత్యలకు ప్రేరేపించడం, తప్పుడు కేసుల నమోదు నుంచి హత్యల వరకు అనేక విధాలా ముస్లింలు హింసకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ ప్రేరేపిత చర్యలతో వైసీపీ నేతలు చాలా మంది ముస్లిం మైనార్టీల ఆస్తులు లాక్కున్నారన్నారు.. తప్పుడు కేసులు, బెదిరింపులు, దాడులు, వేధింపులతో ముస్లింలు అనేక అవమానాలకు గురయ్యారన్నారు. రాష్ట్రంలో ముస్లింలపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరిపించి దోషులను చట్ట ప్రకారం శిక్షించేలా చూడాలని కోరుతున్నానని లోకేష్ గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com