
By - Subba Reddy |20 April 2023 3:30 PM IST
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఓ విద్యార్థిని మరో విద్యార్థి కత్తితో పొడిచాడు. పరీక్షా హాల్‌లో టీచర్ల ఎదుటే ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. బాధిత విద్యార్థి రక్తపు మడుగులోనే కుప్పకూలాడు. ఆ విద్యార్థిని హుటాహుటిన రాజమండ్రిలోని ఓ ఆస్పత్రికి తరలించారు టీచర్లు. కత్తి దాడిలో గాయపడ్డ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com