Yuvagalam : జగన్ దళిత ద్రోహి : నారా లోకేష్

ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్న టీడీపీ యువనేత లోకేష్.. జక్కసానికుంట్లలో ఎస్సీ సామాజికవర్గంతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం అమలు చేసిన NSFDC పథకాన్ని వైసీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని లోకేష్‌కు వివరించారు. గతంలో ఇచ్చిన ఐదు ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్మశాన వాటికలను కూడా వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల ఉన్నత విద్యకు ప్రవేశ పెట్టిన విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారని చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్ దళిత ద్రోహి అంటూ నారా లోకేష్ మండిపడ్డారు. 2001లో రాష్ట్రపతి ఆర్డినెన్స్‌తో ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబు అని చెప్పారు నారా లోకేష్. టీడీపీ సామాజిక న్యాయం కోసం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఐదు ఎకరాల భూమిని తిరిగి ఇస్తామని భరోసా ఇచ్చారు. రేపల్లే రైల్వే స్టేషన్‌లో ఒక దళిత మహిళపై అత్యాచారం జరిగితే.. న్యాయం కోసం పోరాటం చేసింది టీడీపీయేనని లోకేష్ గుర్తుచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com