ఏపీలో ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేదు: బుద్దా వెంకన్న

ఏపీలో ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో సీఎం పర్యటన ఉన్నప్పటికీ.. రామతీర్థం ఘటనా స్థలాన్ని పరిశీలించకపోవడం దారుణమన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు బుద్దా వెంకన్న.
జగన్ రెడ్డి పాలనలో మనుషులకు ఎలాగో రక్షణ లేదు.ఆఖరికి దేవుళ్ళకు కూడా రక్షణ లేకుండా పోయింది.విజయనగరం జిల్లా రామతీర్థం లో శ్రీరాములు వారి విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా టిడిపి చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాను. @ysjagan pic.twitter.com/8mrNqmevTZ
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) December 30, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com