ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల!

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల!
ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. జూన్ 7 నుంచి 16 వరకు టెన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానుందని వెల్లడించారు. అలాగే మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇక ఏడు పేపర్లుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి.

జూన్ 7న ఫస్ట్ లాంగ్వేజ్, 8న సెకండ్ లాంగ్వేజ్, 9న ఇంగ్లీష్, 10న గణితం, జూన్ 11న ఫిజికల్ సైన్స్, 12న బయోలాజికల్ సైన్స్, 14న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 1 నుంచి అన్ని పాఠశాలలు యథాతథంగా పనిచేస్తున్నాయని.. జూన్ 5 వరకు తరగతులు కొనసాగుతాయని తెలిపారు. కొత్త విద్యా సంవత్సరాన్ని జూలై 1 నుంచి మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

Tags

Next Story