ఏపీలో తగ్గిన కోవిడ్ కేసులు!

ఏపీలో తగ్గిన కోవిడ్ కేసులు!
ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుమఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో 33,808 పరీక్షలు నిర్వహించగా 111 మందికి కరోనా నిర్దారణ అయింది.

ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుమఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో 33,808 పరీక్షలు నిర్వహించగా 111 మందికి కరోనా నిర్దారణ అయింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,87,349కి చేరుకుంది. కరోనాతో చికిత్స పొందుతూ అనంతపురంజిల్లాలో ఒక్కరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరూ మరణించారు.

దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,152 మంది మృతి చెందారు. అటు గడిచిన 24 గంటల్లో 97 మంది కోలుకోగా... రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,78,828కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,369 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,29,75,961 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.


Tags

Next Story