ఏపీలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజే 1,184 కేసులు

ఏపీలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజే 1,184 కేసులు
ఏపీలో మళ్లీ కరోనా విలయ తాండవం చేస్తోంది.. రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి..

ఏపీలో మళ్లీ కరోనా విలయ తాండవం చేస్తోంది.. రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి.. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు ఒక వెయ్యి 184 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.. 30వేలా 906 శాంపిల్స్‌ను పరీక్షించగా.. వెయ్యి 184 పాజిటివ్‌ కేసులు తేలాయి.. 24 గంటల్లో కరోనా కారణంగా చిత్తూరులో ముగ్గురు, నెల్లూరులో ఒక్కరు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,50,83,179 టెస్టులు చేసినట్టుగా ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story